Breaking News

డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

డ్యూటీపై నిర్లక్ష్యం వద్దు

సారథి న్యూస్​, కర్నూలు: సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జేసీ–2( అభివృద్ధి) రాంసుందర్‌ రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) రామసుందర్‌రెడ్డి, నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి తదితరులతో కలిసి నంద్యాల, పాణ్యంలోని సచివాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఏకలవ్య నగర్‌లోని సచివాలయం, పాణ్యం మండలంలోని పాణ్యం–4 సచివాలయం, పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట సచివాలయాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. టైంకు డ్యూటీకి రావాలని, ఫిర్యాదులను పరిష్కరించకుండా పెండింగ్​లో పెట్టకూడని సూచించారు. జేసీ వెంట పాణ్యం తహసీల్దార్‌ రత్నరాధిక, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఐదుగురిపై కొరడా
నంద్యాల మున్సిపల్‌ పరిధి, పాణ్యం మండలంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆరుగురి సచివాలయ సిబ్బందిపై జేసీ–2 రాంసుందర్‌ రెడ్డి కొరడా ఝళిపించారు. విధులు నిర్వహించే సమయంలో అందుబాటులో లేకపోవడంతో నంద్యాల పట్టణంలోని ఏకవ్య నగర్‌ సచివాయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ వి.సుధీర్‌కు మంగళవారం షోకాజ్‌ నోటీసు జారీచేశారు. అలాగే పాణ్యం–4 గ్రామ సచివాయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు హాజరుకాని డబ్ల్యూఈఏ వాణిదివ్య, వై.జయలక్ష్మి, సుగాలిమెట్ట సచివాలయంలో నాగేంద్ర నాయక్‌, సంతోష్‌ కుమర్‌కు వివిధ కారణాతో షోకాజ్‌ నోటీసు జారీచేశారు.