Breaking News

డిసెంబర్​ కల్లా గౌరవెల్లి నీళ్లు

ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​

సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నూతనశకం ఆరంభంకానుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్​ అన్నారు. సోమవారం కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగు, పంట మార్పిడి పద్ధతులపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న వేయకుండా ప్రభుత్వం నిర్దేశించిన సన్నరకం వరి ధాన్యంతో పాటు కంది పంటను సాగు చేయడం ద్వారా సరైన మద్దతు ధర లభిస్తుందన్నారు.

రాష్ట్రంలో పండిస్తున్న ఆధునీకరణ పంటలు వాటి దిగుబడి వంటి అంశాలపై రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు వరప్రదాయినీగా ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టుకు వచ్చే డిసెంబర్ కల్లా సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజ్ శ్యామలదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవుల రాధమ్మ, సింగిల్ విండో చైర్మన్ పెర్యాల దేవేందర్ రావు పాల్గొన్నారు.