న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మూడో స్థానంలో నిలిచారు. 120 మిలియన్ ఫాలోవర్స్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, 83 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు.
- July 19, 2020
- Archive
- జాతీయం
- DELHI
- MODI
- PM
- WORLD
- ట్విట్టర్
- మోదీ
- Comments Off on ట్విట్టర్లో మోదీ హవా