Breaking News

ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’

ట్రైలర్ టాక్.. ‘లూట్ కేస్’


బాలీవుడ్​లో మరో సినిమా ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమైంది. కునాల్ ఖేము హీరోగా నటించిన ‘లూట్ కేస్’ సినిమా ఈ నెల 31న డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్​లో రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా.. ఫాక్స్ స్టూడియోస్, సోడా ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గురువారం రిలీజైన సినిమా ట్రైలర్ ఫన్నీ ఎంటర్ టెయిన్ మెంట్ తో ఉండి సినిమా ఆశక్తిని కలిగించేదిలా ఉంది. రెండు నిమిషాల యాభై ఆరు సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ క్రైమ్..సస్పెన్స్.. కామెడీ ఎంటర్ టెయినర్​ ఆద్యంతం ఇంట్రెస్టింగ్, ఆహ్లాదకరంగా సాగింది. ‘లూట్ కేస్’ సినిమా మొత్తం ఒక సూట్ కేస్ చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ‘సూట్ కేస్ దొరకలేదు.. అయితే ఏం దొరికింది.? అన్న డైలాగ్తో మొదలై ‘ఆఖరిసారి అడుగుతున్నా.. ఈ సూట్ కేస్ ఎవరిది..? అన్న డైలాగ్​తో ఎండ్ అయింది.

నందన్ కుమార్ అనే మధ్యతరగతి యువకుడికి రెండువేల రూపాయల నోట్లతో నిండిన సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు కోసం పోలీసులు.. రాజకీయ నాయకులు..విలన్ వెతకులాట మొదలు పెడతారు. హీరో ఆ సూట్ కేసుని ఏమి చేశాడు..? దాని వలన అతను ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు.. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు.. అనే కథనంతో ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేసారని ట్రైలర్ తో అర్థమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. కునాల్ ఖేము నందన్ కుమార్ పాత్రలో నటిస్తుండగా రసికా దుగల్ అతని భార్య పాత్రలో నటించింది. విజయ్ రాజ్ విలన్ కనిపించగా రణ్వీర్ షోరే పోలీసుగా గజరాజ్ పొలిటీషియన్ గా కనిపించారు.