కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులు ఎక్కువే. విశాల్ తాజా చిత్రం ‘చక్ర’ ట్రైలర్ రిలీజైంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై తనే స్వయంగా చిత్రాన్ని నిర్మిస్తూ నటించాడు. ఎంఎస్ ఆనందన్ దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, ట్రైలర్ గ్లిమ్స్ ను రీసెంట్ గా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ ను నాలుగు సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో ఒకేసారి విడుదల చేశారు.
తెలుగులో దగ్గుబాటి రానా, తమిళంలో కార్తీ, ఆర్య, మలయాళంలో మోహన్ లాల్, కన్నడ లో యశ్ విడుదల చేశారు. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. హ్యాకింగ్ ముఠా గుట్టును విశాల్ ఎలా రట్టు చేశాడు ఈ ట్రైలర్లో చూపించారు. విడుదలైన క్షణాల్లోనే వైరల్ అవుతున్న ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేదిలా ఉంది. మిలటరీ ఆఫీసర్ గా విశాల్ పవర్‌ఫుల్ ఎంట్రీ అదిరింది. ది గేమ్ బిగిన్స్, కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్‌లెస్ నెట్‌వర్క్ కూడా ప్రమాదకరమే.. వెల్‌కమ్ టు డిజిటల్ ఇండియా వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రద్ధాశ్రీనాథ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తుండగా రెజీనా కసాండ్రా ఓ కీలకపాత్రలో కనిపించనుంది.