Breaking News

టోక్యో బెర్త్ సాధిస్తా..


న్యూఢిల్లీ: జాతీయ ట్రయల్స్​లో ఓడినా.. ఈసారి టోక్యో ఒలింపిక్స్​కు కచ్చితంగా అర్హత సాధిస్తానని భారత రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. గత ట్రయల్స్ నుంచి ఓటమి పాఠాన్ని నేర్చుకున్నానని పేర్కొంది. ఆసియా క్వాలిఫయర్స్ కోసం నిర్వహించిన 62 కేజీల ట్రయల్స్​లో సోనమ్ మాలిక్ చేతిలో సాక్షి రెండుసార్లు ఓడింది. ‘తొలి బౌట్​లో నేను గెలిచాను. కానీ చివరి సెకన్లలో పాయింట్లు కోల్పోవడంతో బౌట్ చేజారింది. రెండో బౌట్​లో 2–1తో ముందంజలో ఉన్నా. కానీ ఆఖరి నిమిషంలో పిన్​లో ఓడిపోయా. అయితే నేనేమీ బలహీనమని చెప్పుకోను. నాలోనూ స్ఫూర్తి, ఉత్సాహం ఉంది. ఆ రెండు బౌట్ల నుంచి చాలా నేర్చుకున్నా. చివరి సెకన్లలో ఎలా పోటీపడాలో తెలుసుకున్నా. ఓ పెద్ద రెజ్లర్ చేతిలో నేను ఓడిపోలేదు. కాకపోతే నేను వందశాతం సత్తా చూపలేకపోయా’ అని సాక్షి చెప్పుకొచ్చింది.