బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్
న్యూఢిల్లీ: ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీ20 ప్రపంచకప్ జరగడం అనుమానమేనని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ అన్షుమన్ గైక్వాడ్ అన్నాడు. ఈనెల 28న ఐసీసీ సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలన్నాడు. ఒకవేళ ఏవైనా కారణాలతో మెగా ఈవెంట్ వాయిదా పడితే.. ఐపీఎల్ కు మార్గం సుగమమవుతుందన్నాడు. ‘ఐపీఎల్‌కు విండో దొరికినా.. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్ భవిష్యత్ అప్పుడే తేలుతుంది. భారత్ లో అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే లీగ్ జరుగుతుంది. ఇక కరోనా దెబ్బతో క్రికెట్లో చాలా మార్పులు వస్తాయి. వీటన్నింటికి క్రికెటర్లు మానసికంగా సిద్ధం కావాలి. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడాలి. ఇది కష్టమే అయినా అలవాటు పడాల్సిందే. మొత్తానికి క్రికెట్ మొదలుకావడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుంది’ అని గైక్వాడ్ పేర్కొన్నాడు.