Breaking News

టీమిండియా టూర్​ కు ఇబ్బందుల్లేవ్​

  • సీఏ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​

మెల్‌బోర్న్‌: అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ ఏడాది చివరిలో జరిగే ఆసీస్​లో ఇండియా పర్యటనకు ఎలాంటి ఇబ్బందుల్లేవని క్రికెట్​ ఆస్ర్టేలియా(సీఏ) చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​ అన్నాడు. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితులను తొలిగించడానికి అన్ని చర్యలు చేపడతామన్నాడు. ‘ఇప్పటికిప్పుడు భారత్​.. ఆసీస్​కు వస్తుందా? లేదా? అంటే చెప్పలేం. కానీ షెడ్యూల్​ టైమ్​ వరకు కచ్చితంగా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్​ల సందర్భంగా ప్రేక్షకులు ఉంటారో లేదో ఇప్పుడే చెప్పలేం.

ఈ ఒక్క కారణంతో భారత్ ఈ పర్యటనకు దూరంగా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగా ఖాళీస్టేడియాల్లో ప్రేక్షకులు ఉండేలాగే మ్యాచ్​లు ఏర్పాట్లుచేస్తాం​’ అని రాబర్ట్స్​ వ్యాఖ్యానించాడు. ఇక నుంచి ఏ విదేశీ టూర్ ​కెళ్లినా.. బయోసెక్యూర్​ వాతావరణాన్ని కోరుకుంటామన్నాడు. ఇంగ్లండ్‌లో పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ పర్యటనలు జరిగే తీరును బట్టి తమ చర్యలు ఉంటాయన్నాడు. ఏదేమైనా క్రికెటర్ల ఆరోగ్యాన్ని రిస్క్​లో పెట్టబోమని స్పష్టంచేశారు.