Breaking News

టిక్​టాక్​ మళ్లీ వచ్చేస్తోంది

టిక్​టాక్​ రీ ఎంట్రీ

వాషింగ్టన్​: టిక్​టాక్​ సహా అనేక చైనా యాప్​లపై ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ తన యాజమాన్యాన్ని మార్చుకొని మళ్లీ ఇండియాకు వచ్చేస్తోంది. అది ఎలాగంటే.. టిక్​టాక్​ చైనా కంపెనీ కాబట్టి భారత్​ నిషేధించింది. కానీ అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్​.. టిక్​టాక్​ను కొనుగోలు చేస్తోంది. అమెరికాకు చెందిన కంపెనీ అయితే మన ప్రభుత్వానికి అభ్యంతరం ఉండదు. కాబట్టి టిక్​టాక్​ త్వరలోనే ఇండియాకు వచ్చేస్తుందని సమాచారం. అమెరికా ప్రభుత్వం కూడా టిక్​టాక్​ను నిషేధిస్తుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా టిక్​టాక్ యాజమాన్యానికి ​అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ డెడ్​లైన్​ విధించాడు. ‘45 రోజుల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్​ కంపెనీకి టిక్​టాక్​ అమ్మితే సరి. లేదంటే మా దేశంలోనూ టిక్​టాక్​ నిషేధిస్తాం’ అంటూ వార్నింగ్​ ఇచ్చాడు ట్రంప్​. దీంతో విధిలేని పరిస్థితిల్లో మైక్రోసాఫ్ట్​కు టిక్​టాక్​ను విక్రయించనున్నారు. ప్రస్తుతం భారత్​, అమెరికా సంబంధాలు బాగున్నాయి కాబట్టి.. టిక్​టాక్​ మనదేశంలో మళ్లీ దుకాణం తెరవనుంది.