ఎలాంటి క్యారెక్టర్లోకైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు రానా. ‘అరణ్య’ సినిమా రిలీజై ఉండి ఉంటే రానా పర్ఫామెన్స్ తో థియేటర్లు దద్దరిల్లి ఉండేవి. లాక్ డౌన్ ఆ ఆనందాన్ని లేకుండా చేసేసింది. దాన్ని బ్రేక్ చేయడానికేమో అంతకంటే ఎంజాయ్ మెంట్ కలిగించాడు తన పెళ్లి వార్తతో. మిహికాతో తనకున్న ప్రేమను బయట పెట్టి ఆఖరికి పెద్దల వరకూ తీసుకెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసుకున్నాడు. ఇంతకీ ఈ మిహికా ఎవరు? అత్త కూతురా? లేదా పక్కింటి అమ్మాయా? ఎలా వీళ్లిద్దరికీ స్నేహం కుదిరిందబ్బా అనుకుని అందరూ మిహికా ఎవరు ?అన్నదాని కోసం అంతా గాలించేశారు. అభిమానులు డైరెక్ట్‌గా అడగలేకపోయినా మంచులక్ష్మి మాత్రం ఊరుకోకుండా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అడిగేసింది. దానికి రానా కూడా చాలా ఉత్సాహంగా తన లవ్ స్టోరీ చెప్పాడు. మిహిక తనకు చాలా కాలంగా తెలుసునట. ఆమె తన చెల్లెలు ఆశ్రిత క్లాస్మేటేనట.
చాలా రోజుల స్నేహం తర్వాత అది ప్రేమగా మారడంతో రానా ధైర్యం చేసి ముందుగా మిహికా వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మా నాన్నలతో తన ప్రేమ విషయం చెప్పాడట. ఫస్ట్ వాళ్లిద్దరూ షాక్ తిన్నా రానా అప్రోచ్ అయిన విధానం చూసి మురిసిపోయి ఒప్పేసుకున్నారట. ఆ తర్వాతే మిహికాను కన్విన్స్ చేశాడట. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే లవ్ ప్రపోజ్ చేసుకున్నారట. అలా రానా ప్రేమకు తన చెల్లెలే బాట వేసిందన్నమాట. ఏదేమైతేనేం రానా ఓ ఇంటివాడు అవుతుండడం సంతోషించదగ్గ విషయమే.