ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.
వైవిధ్యమైన కథనంతో సాగే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం, సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్ చూపించిన అద్భుతమైన విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ యువ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు. ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ ‘భానుమతి రామకృష్ణ’ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ ‘చాలాకాలం తర్వాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ల వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథను చూడడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచూ చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహాలో విడుదల అవుతుందని’ అని అన్నారు.