Breaking News

జూరాల నీటివిడుదల

సారథి న్యూస్, మహబూబ్ నగర్: ఈ ఏడాది తొలిసారి 20 రోజుల ముందుగానే ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీరు జూరాల ప్రాజెక్టుకు చేరకపోయినా జూరాల కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేశారు. ఈ సారి ఎగువ భారీగా వర్షాలు కురవడంతో నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

ఎగువ నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు ఆధారంగా నడిచే ఎత్తిపోతల పథకాలు నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం దాదాపు 8 టీఎంసీల నీరు జూరాలలో ఉంది. 12వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం ఉదయం నారాయణపూర్​నుంచి విడుదల చేశారు. వరద నీరు 48 గంటల్లో జూరాలకు చేరనుంది.