Breaking News

జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

సారథి న్యూస్, ములుగు: ప్రభుత్వ కాలేజీలు, ఆఫీసులు అన్ని వసతులతో పరిశుభ్రంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్త భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఇన్​చార్జ్​ ప్రిన్సిపాల్​ను ఆదేశించారు. ఎంత మంది సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, తరగతి గదుల వివరాలను జిల్లా కలెక్టర్ ఇన్​చార్జ్​ప్రిన్సిపాల్ కె.లక్ష్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ కళాశాల ఆవరణలో చెత్త లేకుండా చూడాలని ఆదేశించారు.