వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దకొడుకు జూనిర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గుయిల్ ఫాయల్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ట్రంప్ ప్రచార టీమ్ సీనియర్ ఫండ్ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ దగ్గర పనిచేసే వారిలో వైరస్ బారినపడిన మొదటి వ్యక్తి ఈమె. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో ఎన్నికల సభలో పాల్గొనాల్సి ఉండగా, పాజిటివ్ రావడంతో ఆమె వెళ్లలేదని అన్నారు. ఇటీవల ఆమె ట్రంప్‌తో కానీ, జూనియర్ ట్రంప్‌తో కానీ కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదని దీంతో వారికి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. అమెరికాలో రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్కరోజులో దాదాపు 50వేల కేసులు నమోదవుతున్నాయి.
- July 4, 2020
- Archive
- జాతీయం
- AMERICA
- JUNIOR TRUMPH
- KIMBARLY
- అమెరికా
- కింబర్లీ
- గర్ల్‌ఫ్రెండ్
- జూనియర్ ట్రంప్
- Comments Off on జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా