Breaking News

జాగ్రత్తలు పాటిస్తూనే రేషన్ పంపిణీ

జాగ్రత్తలు పాటిస్తూనే రేషన్ పంపిణీ

సారథి న్యూస్, బెజ్జంకి: రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూనే రేషన్ పంపిణీ చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. బెజ్జంకి ఎంపీడీవో ఆఫీసులో డీలర్లకు మంగళవారం కమిషన్ చెక్కులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత పాల్గొన్నారు.