న్యూఢిల్లీ: లడాఖ్‌లో సైనికుల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. అమరులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌చేశారు. ‘గల్వాన్‌లో సైనికులను కోల్పోవడం దురదృష్టకరం. మన సైనికులు విధినిర్వహణలో ఎంతో శౌర్యాన్ని ప్రదర్శించారు. వారి కుటుంబాలకు భారతజాతి మొత్తం అండగా ఉంటుంది’ అంటూ ట్వీట్‌చేశారు.
సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఇండియా– చైనా సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్న విషయం తెలిసిందే. మంగళవారం లడాఖ్‌లో మన సైనికులపై చైనా ఆర్మీ ఆకస్మికంగా దాడి చేయడంతో 20 మంది అమరులయ్యారు. వారిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ కుమార్ ఉన్నారు.
- June 17, 2020
- Archive
- జాతీయం
- BHARATH
- CHINA
- DELHI
- GALWAN
- RAJNATHSINGH
- లడాఖ్
- సరిహద్దు
- Comments Off on జవాన్ల మృతి కలచివేసింది