జర్నలిస్టుల సేవలు అమోఘం
సారథి న్యూస్, వనపర్తి: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో జర్నలిస్టులు నిస్వార్థంతో ప్రజలను జాగృతం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లాలో జీరో కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో గ్రీన్ జోన్ గా రికార్డుకెక్కిందని గుర్తుచేశారు. కరోనా ప్రభావం అంతగా లేకున్నా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చినప్పుడు మాస్క్ లు తప్పకుండా ధరించాలని మంత్రి సూచించారు.