సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్బెడ్రూమ్ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్బండి విజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు దివంగత జర్నలిస్టు హబిబ్ మృతికి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవీ రమణ, ఉపాధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీలు నరసింహ, సుకుమార్, జంగం దిలీప్ కుమార్, రవి, ఎన్.గోపాల్, జీఎస్.ప్రకాష్. వై.నరసింహులు, ఖాజామొయినుద్దీన్, హరిప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
- December 12, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- MAHABUBNAGAR
- MLA MAHIPALAREDDY
- TWJF
- టీడబ్ల్యూజేఎఫ్
- పటాన్ చెరు ఎమ్మెల్యే
- మహబూబ్‌నగర్
- మహిపాల్‌రెడ్డి
- వర్కింగ్జర్నలిస్టు
- Comments Off on జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు