సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం శిరివెళ్ల వాసి, ప్రముఖ సినీనటుడు జయప్రకాష్ రెడ్డి అకాల మరణం తీరని లోటని జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ జి.వీరపాండియన్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నంద్యాల టౌన్ హాల్ లో 10రోజుల పాటు ఎంతో విజయవంతంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల్లో తూర్పు జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలుగు నాటక రంగస్థల వేదికలపై తన స్వీయరచన, దర్శకత్వం, నటనతో అగ్రస్థాయికి చేరారని కొనియాడారు. ఆయన అకాలమృతి తెలుగు సినిమా రంగంతో పాటు నాటకరంగానికి తీరని జిల్లా సాంస్కృతిక మండలి కన్వీనర్ పి.తిమ్మప్ప సంతాపం తెలిపారు.
- September 8, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- JAYAPRAKASHREDDY
- Kurnool
- SHIRIVELLI
- కర్నూలు
- జయప్రకాష్‌రెడ్డి
- నంది నాటకోత్సవం
- శిరివెళ్ల
- Comments Off on జయప్రకాష్ రెడ్డి మృతి తీరని లోటు