Breaking News

జనరల్​బాడీ మీటింగ్.. సభ్యుల గరంగరం

జనరల్​బాడీ మీటింగ్.. గరం గరం

సారథి న్యూస్, కౌడిపల్లి: మెదక్ ​జిల్లా కౌడిపల్లి మండల జనరల్​బాడీ మీటింగ్ ​వాడీవేడిగా సాగింది. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీపీ అజహరుద్దీన్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యురాలు కవితా అమర్ సింగ్, ఎంపీపీ రాజునాయక్ మాట్లాడుతూ.. మండలంలో ప్రతి డిపార్ట్​మెంట్ ​వారు సమాచారం లేకుండా సమావేశాలు నిర్వహించుకుంటున్నారని, దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఉపాధి హామీ నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న తీరు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని ఆయా గ్రామాల సర్పంచ్​లు అధికారులపై మండిపడ్డారు. నీటితొట్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, సెక్రియేషన్ షెడ్లు నిర్మించినప్పటికీ బిల్లులు రావడం లేదని ఆక్షేపించారు. కొన్ని గ్రామాల్లో మొక్కలు నాటించిన కొంత మందికి మాత్రమే ఉపాధి డబ్బులు పడ్డాయని, మిగతావారికి నయాపైసా రాక అవస్థలు పడుతున్నారని వాపోయారు.

కౌడిపల్లి సర్వసభ్య సమావేశంలో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీస్తున్న సర్పంచ్​

ఏదైనా సమస్యపై ఉపాధి హామీ ఆఫీసుకు వెళ్తే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు కనీసం లెక్కచేయడం లేదని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్​లు ఆవేదన వ్యక్తంచేశారు. ఐసీడీఎస్ ​సీడీపీవో హేమభార్గవి మాట్లాడుతూ.. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా రక్తహీనత లోపం ఉందని, తండాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె వివరించారు. సర్పంచ్​లు బాధ్యతలు తీసుకుని అవగాహన కల్పించాలని కోరారు. తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామాగౌడ్, ఏవో పద్మావతి, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, సర్పంచ్​లు చంద్రశేఖర్ గుప్తా, సంజీవ్, రమేష్ నాయక్, ఎల్లం, పద్మ కిష్టయ్య పాల్గొన్నారు.