సారథిన్యూస్, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్ చైర్మన్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్ మహంకాళి స్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు రాచపల్లి రవికుమార్. మిట్టపల్లి అంకుష్, గొర్రె నరసింహారావు, గొర్రె శంకర్, రవి, పర్వతాలు, రాజేందర్, కనుకుంట్ల రమేష్, సదయ్య, వీరయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి పాల్గొన్నారు.
- July 6, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DALITHS
- JAGJIVANRAM
- KARIMNAGAR
- RAMAGUNDAM
- ఉపప్రధాని
- వర్ధంతి
- Comments Off on జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం