Breaking News

జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

జగదీష్ రెడీ అయిపోతున్నాడు..

షూటింగ్స్ బంద్ అయి నాలుగు నెలలు గడిచింది. అన్ని సినిమాలు కూడా వాయిదా పడిపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ అయిపోనున్నాయట. దానికోసం కొంతమంది తెలివైన నిర్మాతలు మాత్రం ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నాని నటిస్తున్న ‘టక్ జగదీష్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో పల్లె వాతావరణంలో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో అనుకుంటూ ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టేది క్లారిటీ లేదు కాబట్టి ఎప్పుడైతే లాక్ డౌన్ సడలించారో అప్పటి నుంచి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారట. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తయిన పార్ట్ కు డబ్బింగ్.. రీ రికార్డింగ్.. ఎడిటింగ్ ఇలా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసేశారట. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్ కు వెళ్లడం ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ గా చేయడం ఆ వెంటనే సినిమాను విడుదల చేయడంపై దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో రీతూ వర్మ.. ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.