Breaking News

‘జంగిల్’ ​ఫస్ట్ లుక్

‘జంగిల్’​ఫస్ట్ లుక్

సక్సెస్​తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు సాయికుమార్ తనయుడు ఆది. ఈ క్రమంలో ఆది నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జంగిల్’. ఆదికి జోడీగా వేదిక నటించింది. హార్రర్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ కుమార్ సమర్పణలో న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్ పై మహేశ్ గోవిందరాజ్, అర్చనచందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నోయరిక లల్లు, మధుసూదన్ రావు, జై కుమార్ తదితరులు నటించారు. తాజాగా ‘జంగిల్’ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరోయిన్​ వేదిక ఓ లాంతర్​ పట్టుకుని ఉండగా, ఆ వెలుగులో ఆదేదో చూస్తూ షాక్ కు గురవుతున్నట్లు కనిపిస్తున్నాడు. చిమ్మచీకటిగా ఉన్న ఓ ప్రాంతంలో చుట్టూ అస్థిపంజరాలతో ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ‘జంగిల్’ టైటిల్ కు ఇది శ్వాసిస్తుంది.. ఇది దాక్కొని ఉంటుంది.. ఇది వేటాడుతుంది’ అనే క్యాప్షన్ తోనే ఈ సినిమాలో ఏదో భయంకరమైన జంతువో.. దెయ్యమో ఉండబోతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ అందించగా శివ నందీశ్వరన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం సమకూర్చారు. డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ సినిమా విడుదల తేదీని చిత్రయూనిట్ ​ప్రకటించనుంది.