న్యూఢిల్లీ: చైనాను దెబ్బతీసేందుకు మన సైన్యం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ మేరకు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) కొత్త భాషను నేర్చుకుంటుంది. ఐటీబీపీలోని 90వేల మంది చైనాలో ఎక్కువగా మాట్లాడే మాండరిన్ భాష నేర్చుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక కోర్సును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌లో ఇటీవల జరిగిన గొడవల నేపథ్యంలో ఐటీబీపీ తమ జవాన్ల కోసం మాండరిన్ కోర్సును నేర్పిస్తున్నారు.
మన సైనికులు మాండరిన్ భాషను నేర్చుకుంటే చైనా సైనికులతో నేరుగా మాట్లాడేందుకు వీలుంటుందని, వారి ఆదేశాలు, ప్రణాళికలు, సూచనలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా వ్యూహాలు రచించే వీలు ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా, ఎల్‌వోసీలోని మన సైనికులకు కొంత మేర మాండరిన్ భాష అర్థమవుతుందని, కొన్ని పదాలను మనవాళ్లు అర్థం చేసుకోగలరని ఒక అధికారి చెప్పారు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో నేర్చుకుంటే గొడవలు, సంభాషణలు హాట్‌టాపిక్‌గా మారే అవకాశాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.