Breaking News

చైనాను ఆపాల్సిందే..

చైనాను ఆపాల్సిందే..

చండీగఢ్‌: చైనా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ విమర్శించారు. ‘మేం(కాంగ్రెస్‌) 1948, 65,71,99లో యుద్ధాన్ని గెలిచాం. చైనాను ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లదే (బీజేపీ). చైనాతో 60 నుంచి గొడవ నడుస్తూనే ఉంది. గాల్వాన్‌ గొడవ ఇప్పటిది కాదు. ప్రభుత్వం మిలటరీ ప్రీకాషన్స్‌ తీసుకుంటుందని నమ్ముతున్నాను. మనం వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను’ అని అమరేందర్‌‌సింగ్‌ అన్నారు.

కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాని మోడీ క్రియేట్‌ చేసిన పీఎం కేర్స్‌కు చైనా కంపెనీలు ఇచ్చిన డొనేషన్లను కూడా వెనక్కి ఇచ్చేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగి.. మన సైన్యం చనిపోయినప్పుడు వాళ్ల ఫండ్‌ మనకు అవసరం లేదని ఆయన చెప్పారు. మనం చైనా వాళ్ల డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అని చెప్పారు. ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌లో జరిగిన ఘటనలో మన ఆర్మీకి చెందిన 20 మంది అమరులయ్యారు. దీంతో ఇండియా– చైనా మధ్య ఉద్రికత్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించింది.