Breaking News

చివరి రోజు.. హోరాహోరీ

చివరి రోజు.. హోరాహోరీ

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్​ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్​ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. ఎన్నో విదేశీ ఫార్మా, ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ ​యాదవ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ​పద్మారావుగౌడ్, టీఆర్ఎస్ ​కార్పొరేటర్​ అభ్యర్థులు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, రాచూరి సునీత, ప్రసన్న, కంది శైలజ తదితరులు పాల్గొన్నారు.

రోడ్​ షోకు హాజరైన అశేషజనం