Breaking News

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

చివరి ఆయకట్టు దాకా సాగునీరు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): చివరి ఆయకట్టు దాకా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్​ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో లిఫ్ట్​ మోటార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అలంపూర్​మండలానికి మూడు లిఫ్టులను ఏర్పాటు చేశామన్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

చేపపిల్లలను నదిలో వదులుతున్న ఎమ్మెల్యే వీఎం అబ్రహం

మత్స్యకారుల అభ్యున్నతికి కృషి
రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామంలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపపిల్లలను వదిలే కార్యక్రమానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. రెండులక్షల చేపపిల్లలను నదిలో వదిలినట్టు తెలిపారు. మత్స్యకారులకు ఆటోలు, బొలెరో వాహనాలు, బైక్​లను అందించి వారి ఆర్థిక తోడ్పాటుకు కృషిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొందిమల్ల సర్పంచ్ వసుంధర పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, లిఫ్ట్ చైర్మన్ మోహన్ రెడ్డి, టెంపుల్ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, క్యాతూర్ లిఫ్ట్ చైర్మన్ చందురెడ్డి పాల్గొన్నారు.