సారథి న్యూస్, వాజేడు: పస్రా ఫారెస్ట్రేంజ్ పరిధిలో ఉన్న చల్వాయి నర్సరీ కేంద్రాన్ని గురువారం ములుగు డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు చేశారు. అనంతరం లక్నవరంలోని ఎకో పార్క్ ను సందర్శించిన డీఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి సిబ్బందిని ఫుడ్ కోర్ట్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం లక్నవరంలోని వాచ్ టవర్ నిర్మాణ పనులను పరిశీలించి వచ్చేనెల వరకు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ములుగు ఎఫ్ డీవో నిఖిత, పస్రాఎఫ్ఆర్వో మాధవి శీతల్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఉన్నారు.
- October 8, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- DFO
- MULUGU
- PASRA
- VAJEDU
- డీఎఫ్వో
- పస్రా
- ములుగు
- వాజేడు
- Comments Off on చల్వాయి నర్సరీని పరిశీలించిన డీఎఫ్ వో