సారథి న్యూస్, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదక్ పల్లి గ్రామం ఎర్రగుంటలో శనివారం ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెళ్లి చప్పట్ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కానుగుల వెంకటయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఉపాధి కూలీలకు మాస్కులు, శాన్ టైజర్లు పంపిణీ చేయకుండా వందమంది కూలీలతో ఒకే చోట పనిచేయించడం సరికాదన్నారు.
లాక్ డౌన్ ఉన్నంత వరకు ఉపాధి పనులు నిలిపివేసి ప్రతి ఉపాధి కూలీ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రూ.7500 వేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున వారికి పాత వేతనాలు వెంటనే ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు
కార్యక్రమంలో యాదయ్య కృష్ణయ్య, టి.వెంకటయ్య దుర్గాపురం చెన్నయ్య, తిరుపతి తిరుమల, రాఘవేందర్, ఎస్.పర్వతాలు పాల్గొన్నారు.
- April 25, 2020
- లోకల్ న్యూస్
- LOCKDOWN
- RANGAREDDY DIST
- ఉపాధి హామీ
- కరోనా
- వ్యవసాయ కార్మిక సంఘం
- Comments Off on చప్పట్లతో నిరసన