శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. డెడ్బాడీస్కు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. మెడికో – లీగల్ పరీక్షల్లో భాగంగా టెస్టులు చేశామని, డీఎన్‌ఏ, కరోనా పరీక్షలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. దీంతో కరోనా రూల్స్‌కు అనుగుణంగా బారాముల్లాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని అన్నారు. జమ్మూకాశ్మీర్ జిల్లాల్లో పోలీసులు టెర్రరిస్టులు ఏరివేతే మొదలుపెట్టారు. గడిచిన ఆరు నెలల్లో దాదాపు 118 మంది టెర్రరిస్టులు హతమైనట్లు కాశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ చెప్పారు. వీరిలో 107 మంది స్థానిక టెర్రరిస్టులు కాగా.. మరో 11 మంది పాకిస్తానీలు ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దర టెర్రరిస్టులను మట్టుబెట్టారు.
- July 5, 2020
- Archive
- జాతీయం
- CARONA TEST
- MEDICOLEGAL
- TERRORIST
- బారాముల్లా
- మెడికోలీగల్
- శ్రీనగర్
- Comments Off on చనిపోయిన ఇద్దరు టెర్రరిస్టులకు కరోనా