- నాందేడ్ – ఆకొలా హైవేపై ఘటన
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో గురువారం నాందేడ్ – ఆకొలా హైవేపై అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఓ వ్యక్తి తల మొండెం నుంచి వేరుపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. పెద్దశంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య అల్లాదుర్గం మండలం రాంపూర్ లోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే అతడు గురువారం బైక్ పై పనికి బయలుదేరి వెళ్లాడు.
కొద్దిసేపట్లో రైస్ మిల్లుకు చేరుకునే సమయంలో ఎదురుగా వస్తున్న డోజర్ బైక్ ను బలంగా ఢీకొంది. దీంతో దుర్గయ్య తల తెగి మొండెం, తల వేర్వేరుగా పడిపోయాయి. ఈ సంఘటన చూసి వారిని కలచివేసింది. మృతుడు దుర్గయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. అల్లాదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.