Breaking News

గోవా ముఖ్యమంత్రికి కరోనా

పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ‘ నాకు లక్షణాలు ఏమీలేవు. కానీ కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేను ఇంట్లో నుంచి నా విధులను నిర్వర్తిస్తాను. దయచేసి నన్ను ఇటీవల కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు ఉన్నా లేకపోయినా వెంటనే పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్​గా నిర్ధారణ అయితే ఆందోళన చెందకుండా చికిత్స తీసుకొండి. కరోనా తెలికగా తీసుకోవాల్సిన వ్యాధి ఏమీ కాదు. కానీ మరీ అంత ఆందోళన కూడా అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.