న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన భారత అథ్లెట్ గోమతి మారిముత్తుపై నాలుగేళ్ల నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఆసియా అథ్లెటిక్స్ 800 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన స్వర్ణ పతకాన్ని కూడా వెనక్కి తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.లక్ష జరిమానా విధించనున్నారు. పోటీల సందర్భంగా సేకరించిన శాంపిల్–ఏ ను పరీక్షించగా డోప్ ఉత్ర్పేరకాలు ఉండడంతో గతేడాది మే నెలలో గోమతిపై తాత్కాలిక నిషేధం విధించారు. తాజాగా శాంపిల్–బీ కూడా పరీక్షించడంతో పాజిటివ్‌గా తేలింది. దీంతో 2023 మే 16వ తేదీ వరకు గోమతి ఎలాంటి పోటీల్లో పాల్గొనలేదు.
- June 9, 2020
- Top News
- క్రీడలు
- ATHLET
- GOMATHI
- అథ్లెట్ గోమతి
- డోపింగ్
- Comments Off on అథ్లెట్ గోమతిపై నాలుగేళ్ల నిషేధం