సారథి న్యూస్, రామడుగు: దక్షిణ గంగానదిగా పేరున్న గోదారమ్మ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పరవళ్లు తొక్కి ఆదివారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా లక్ష్మిపూర్ గాయత్రి పంప్ హౌస్ వద్ద ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 22 పంపింగ్ కేంద్రాలు ఉన్న 96 పంపులు, మోటార్స్ ను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిచారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 40లక్షల ఎకరాలకు సాగునీరు, పలు నగరాలకు పట్టణాలకు తాగునీరు అందుతుందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు కాళేశ్వరంలో భాగమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
- June 21, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- GAYATHRI
- KARIMNAGAR
- గాయత్రి పంప్ హౌస్
- గోదారమ్మ
- Comments Off on గోదావరి గాయత్రికి చేరి ఏడాది