సారథి న్యూస్, గోదావరిఖని: రాష్ట్రంలో టీఆర్ఎస్ 20 వసంతాలు పండుగను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం కసరత్తు చేసుకుంటుండగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ప్రొటోకాల్ పాటించాలని కొందరు, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని మరికొందరు ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా వాగ్వాదానికి దిగారు. ‘పార్టీ జెండాను మేము ఎగరవేస్తామంటే మేమంటూ’ రచ్చ రచ్చ చేశారు.
గులాబీలో గలాట
కార్యకర్తలు కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలను ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గులాబీ తమ్ముళ్లు వినిపించుకోలేదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసిపని చేసి పార్టీని అభివృద్ధికి తోడ్పడాలే గాని వీధుల్లో ముష్టియుద్ధానికి దిగి పరువు తీసుకోవద్దని పలువురు బాహాటంగానే అభిప్రాయపడుతున్నారు.