Breaking News

గురుకులాల్లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో చేరేందుకు ఇంటర్మీడియట్​ సెకండియర్​ స్టూడెంట్స్​కు TGUGCET(2020-21) నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు ఆన్​లైన్​లో పొందుపరిచారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కింది తేదీల్లో కౌన్సెలింగ్​కు హాజరుకావాలని గురుకుల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో సంప్రదించాలని సూచించారు.

కౌన్సెలింగ్​ తేదీలు
–బీఎస్సీ(ఎంపీసీ), జూన్​ 25, 26 తేదీలు..
–బీఎస్సీ(ఎంఎస్​సీఎస్​)/బీఏ(హెచ్​ఈపీఏ), బీకామ్​(కంప్యూటర్​), జూన్​ 27, 28,29 తేదీలు.
–బీఎస్సీ(బీజెడ్​సీ), బీఎస్సీ(ఎంపీసీఎస్​), బీఎస్సీ(ఎన్​డీజడ్​సీ), బీఏ(ఈపీజే), బీకామ్​(హాన్​), జూన్​30, జులై 1వ తేదీ,
–బీఎస్సీ(ఎంబీజడ్​సీ), బీఎస్సీ(ఎంఈసీఎస్​), బీఎస్సీ(బీసీజడ్​సీ), బీఏ(ఈపీఎస్​), బీకామ్​(టాక్స్​), జులై 2, 3వ తేదీలు,
–బీకామ్​(కంప్యూటర్స్​), బీఎస్సీ(ఎంపీజీ), బీఎస్సీ(బీటీబీసీ), బీఏ(ఈపీజీ), జులై 4, 6వ తేదీలు..
–బీకామ్​(జనరల్​), బీఎస్సీ(బీజీసీ), బీఏ(ఈపీపీఎస్​), జులై 4, 6వ తేదీలు..
–బీఏ(హెచ్​ఈపీ), బీఎస్సీ(బీసీఈఎస్​క్యూసీ), బీబీఏ కోర్సులకు జులై 9, 10వ తేదీల్లో కౌన్సెలింగ్​ జరుగుతుంది.

విద్యార్థులకు సూచనలివే..
–మాస్క్ తప్పకుండా కట్టుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.
–TGUGCETహాల్ టికెట్, అలాట్ మెంట్ కార్డు తీసుకురావాలి.
– టెన్త్, ఇంటర్​ మీడియట్​ ఒరిజినల్​ సర్టిఫికెట్లు తప్పనిసరి.
– కులం, ఆదాయం సర్టిఫికెటులు, ఆధార్​ కార్డు తీసుకురావాలి.
– అభ్యర్థులు 10 ఫొటోలను తీసుకురావాలి.

www.tswreis.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.