సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన విద్యుత్‌చార్జీలు ప్రజలకు గుదిబండలా మారాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విమర్శించారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కోనేరు మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విద్యుత్ బిల్లులు మరింత భారంగా మారాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్, ఎర్రం రాజు, సీతారాంనాయక్, హనుమంతరావు, లక్ష్మణ్ అగర్వాల్, శ్రీనివాస్ కుమార్, నోముల రమేశ్, కోనేరు నాగేశ్వరరావు, రాయుడు నాగేశ్వరావు, మొగిలిపాక రవి, శ్రీను, సత్యనారాయణ, హరిహరన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- June 15, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- BHADRADRI KOTHAGUDEM
- BJP
- ELECTRICITY BILL
- లాక్ డౌన్
- విద్యుత్ బిల్లులు
- Comments Off on గుదిబండలా విద్యుత్ బిల్లులు