సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మ బంధువని అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ స్వరూప, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- June 23, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- CM KCR
- HUSNABAD
- KARIMNAGAR
- MPP
- కరీంనగర్
- సంక్షేమం
- Comments Off on గిరిజనుల ఆత్మ బంధువు కేసీఆర్