సారథి న్యూస్, మెదక్: గర్భిణులు, బాలింతలను రక్తహీనత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం పోషక పదార్థాలు అందిస్తోందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో పోషణ్ అభియాన్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు, టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గర్భిణులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనతపై మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, టీచర్లు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ తాము తీసుకునే ఆహారపు అలవాట్లు, విధానాలను మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా, శిశుసంక్షేమశాఖ జిల్లా అధికారిణి రసూల్‌బీ, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేష్‌కుమార్, సీపీవో శ్రీనివాసులు, ఐసీడీఎస్ సీడీపీవోలు హేమభార్గవి, భార్గవి, స్వరూప పాల్గొన్నారు.
- September 8, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- ANGANVADI CENTERS
- medak
- POSHANABIYAN
- పోషణ్‌అభియాన్
- మెదక్
- శిశుసంక్షేమశాఖ
- Comments Off on గర్భిణులు పోషకాహారం తీసుకోవాలే