సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాలకుర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. శుక్రవారం చిన్నజీయర్ స్వామితో కలిసి సీఎం కె.చంద్రశేఖర్‌రావు దంపతులు మోటార్లను ఆన్‌చేసి ప్రారంభించారు. మర్కుక్ పంప్ హౌస్ నుంచి కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
సముద్రమట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం సరికొత్త చరిత్రను లిఖించినట్టయింది. సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్ ను నిర్మించారు. అలాగే ఐదు జిల్లాలకు ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది.