సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. కొద్దిరోజుల్లోనే కరోనా పరీక్షలు ప్రారంభిస్తామని చెప్పారు.
- July 1, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- CARONA
- EETALA
- HOSPITAL
- KAMMAM
- PUVVADA
- TESTS
- Comments Off on ఖమ్మంలోనే కరోనా పరీక్షలు