సారథి న్యూస్, రామడుగు : రామడుగు పీహెచ్సీని కరీంనగర్ డీఎంహెచ్వో జి.సుజాత బుధవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ముంబై, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు గల అనుమానితులను జిల్లా క్వారంటైన్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
- May 27, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- DMHO
- PHC
- RAMADUGU
- ఆస్పత్రి
- క్వారంటైన్
- డీఎంహెచ్వో
- Comments Off on క్వారంటైన్ కు కరోనా అనుమానితులు