మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్‌డౌన్‌తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం సినిమా థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో కొందరు నిర్మాతలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియర్ల ఒత్తిడి భరించలేక ఓటీటీలకు సినిమాలు అమ్ముకుంటున్నారు.