‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా కొత్త సినిమా షురూ చేయలేకపోయాడు. ఎట్టకేలకు ‘మహాసముద్రం’ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. అది కూడా చాలా రోజులు అయింది. హీరోల విషయంలో తర్జనభర్జనలు జరిగాయి. మొత్తానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ షూటింగ్ రెడీ అవుదామంటే కరోనా అడ్డొచ్చింది. ఇప్పుడిక యూనిట్ సభ్యులు షూట్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ మూవీ కూడా షూటింగ్ కార్యక్రమాలను సంసిద్ధం చేసుకుంటోంది.
ఈ చిత్రంలో ‘ప్రస్థానం’ మూవీ తర్వాత శర్వా మళ్లీ అలాంటి బలమైన పాత్రను పోషించనున్నాడట. అయితే ఇందులో శర్వాన్తో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తోంది. హీరోయిన్ గా అదితీరావు హైదరి ఎంపిక చేశారట. కానీ సినిమాలో హీరోయిన్ మధ్యలో చనిపోతుందని.. స్టోరీ వెర్షన్ కూడా చాలా కొత్తగా ఉందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ చిత్ర సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడించలేదు టీమ్.