Breaking News

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం

క్రీస్తు పుట్టుక ఓ శుభసూచికం


ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య
సారథి న్యూస్​, ములుగు: క్రిస్మస్ సందర్భంగా ములుగు జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవులకు ములుగు కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక ప్రపంచానికే ఓ శుభసూచికమని, ఆయన జననం ఓ సంచలనం అని కొనియాడారు. క్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయ, కృప, శాంతి ప్రజలంతా ఆచరించదగినవని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి మనల్ని విముక్తి చేసేలా క్రైస్తవులు ప్రార్థనలు చేయాలని కోరారు. క్రీస్తు చూపిన ప్రేమ మనందరికీ మాదిరిగా నిలుస్తుందని, ఆ ప్రేమతోనే ముందుకు సాగాలని ఆకాంక్షించారు.