Breaking News

క్రిస్మస్​కు ‘సోలో బ్రతుకే సో బెటర్’

క్రిస్మస్​కు ‘సోలో బ్రతుకే సో బెటర్’

క్రిస్మస్ కానుకగా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయడానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’అంటూ సిద్ధమయ్యాడు సాయితేజ్. సుబ్బు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ చిత్రంలో నభానటేష్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, సత్య, వెన్నెల కిశోర్, అజయ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. నిన్న మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ‘మన రాజ్యాంగం మనల్ని స్వేచ్ఛగా బ్రతకమంటే.. ప్రేమ, పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్ షిప్స్ తో నాశనం చేసుకుంటున్నాం’ అని తేజ్ చెప్పే డైలాగ్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాగే ‘సినిమా హాళ్లలో మందుకు సిగరెట్లకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్టే.. పెళ్లికి పెళ్లానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి..’ అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఫన్ క్రియేట్ చేస్తోంది. విరాట్ పాత్రలో తేజ్, అమృత క్యారెక్టర్ లో నభా కనిపించనున్నారు. ఆర్.నారాయణమూర్తిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని సోలోగా ఉండాలనుకున్న విరాట్ లైఫ్ లోకి అమృత ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత విరాట్ లో ఎలాంటి మార్పు వస్తుందనేది కథగా తెలుస్తోంది. ‘ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పెళ్లి చేసుకోవాలి ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆర్.నారాయణమూర్తి చెప్పడం చూసి తేజ్ షాక్ అవడంతో పూర్తయిన ట్రైలర్ ఇంప్రెస్ చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టోటల్ గా తేజ్ సోలోగా మెప్పించేటట్టే ఉన్నాడు.

https://youtu.be/CtRvAZSQH5I