Breaking News

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్!

న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆశ్చర్యకమైన నిర్ణయం తీసుకోబోతున్నదా? ఇంగ్లండ్​ తో ఉప్పునిప్పులా వ్యవహరించే ఆసీస్… ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్​కు కీలక పదవి కట్టబెట్టనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే తెలుస్తున్నది. ఇంగ్లండ్ మాజీ సారథి స్ట్రాస్ ను . సీఈవోగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఏ పెద్దల నుంచి భారీగానే మద్దతు ఉన్నట్టు సమాచారం. గతేడాది ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాస్.. ఈ నియమాకానికి ఎలా స్పందిస్తాడో చూడాలి. అయితే స్ట్రాస్​కు అసిస్​తోనూ మంచి అనుబంధమే ఉంది. ఇంగ్లండ్ తరఫున ఆడకముందు.. 1998–99లో స్ట్రాస్… సిడ్నీ యూనివర్సిటీకి ఆడాడు.