‘ఫగ్లీ’మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ ‘ఎమ్ఎస్ ధోని’ మూవీతో అక్కడ, ‘భరత్ అను నేను’తో తెలుగునాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్గా ‘కబీర్ సింగ్’తో మరింత స్టార్ డమ్ మూటగట్టుకుంది. దాంతో కియారా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్ లో తన అందాలతో కిక్ ఎక్కించిన కియారా ఇప్పుడు కోలీవుడ్ లో అడుగుపెట్టనుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అందులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం అందిబుచ్చుకుందని ప్రచారం జరుగుతోంది. పి.వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా కియారాని ఫైనల్ చేశారని టాక్ కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కియారా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు కానీ.. ఈ మూవీలో లారెన్స్ నటిస్తున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రకటించాడు.
అయితే కియారా నటించిన హారర్ కామెడీ మూవీ ‘లక్ష్మీ బాంబ్’ త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మరో హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘భూల్ భూలయ్యా-2’ చిత్రంలో కూడా కియారా నటిస్తోంది. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ కూడా నిజమైతే కియారా చేసే రెండో హార్రర్ మూవీ అవుతుంది. అలాగే ‘ఇందూ కి జవానీ’ అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించనున్న ‘షెర్షా’ సినిమాల్లో కూడా కియారానే హీరోయిన్.