Breaking News

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం

కోయిల్ సాగర్​లో 31 ఫీట్ల నీటిమట్టం


సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు శనివారం పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరింది. ప్రాజెక్టు మొత్తం నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు. అయితే ప్రాజెక్టులో 31 ఫీట్లకు నీటి నిల్వ చేరింది. దీంతో ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి కోయిల్ సాగర్ కు ఒక మోటారు ద్వారా కృష్ణాజలాలను తరలిస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వర్షపునీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. రేపోమాపో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.