సారథిన్యూస్, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్‌లను అధికారులు పరిశీలిస్తున్నారు.
- June 25, 2020
- Archive
- నల్లగొండ
- CARONA
- KODADA
- NELAKONDAPALLY
- SURYAPET
- ప్రైమరీ కాంటాక్ట్
- సాఫ్ట్వేర్ఉద్యోగి
- Comments Off on కోదాడలో తొలి కరోనా